🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 11:34 pm Posted by : TELANGANA KERATAM

శాలిగౌరారం* మండల కేంద్రంలో నిర్వహించిన *నూతన చేయూత పింఛన్ల మంజూరు* ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం

News Image
*శాలిగౌరారం* మండల కేంద్రంలో నిర్వహించిన *నూతన చేయూత పింఛన్ల మంజూరు* ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం మరియు *ఎల్‌నినో (El Niño) ప్రభావంపై* నిర్వహించిన సమీక్షా సమావేశంలో *తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామేలు* గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నాను. నూతన చేయూత పింఛన్ల మంజూరు ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపాను.

అలాగే, ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి, వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించాను.

ఈ సమావేశంలో పాల్గొన్న *నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ బడుగు చంద్రశేఖర్* గారు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం *అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను* అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో శ్రీ అశోక్ రెడ్డి గారు, శాలిగౌరారం మండల ప్రత్యేక అధికారి శ్రీమతి రమాదేవి గారు, ఎంపీడీవో శ్రీ రమేష్ గారు, ఎమ్మార్వో శ్రీ మాధవరావు గారు, మండల స్థాయి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 *శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి* 
 *భువనగిరి ఎంపీ* 
 *టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మెన్*
🏠 Home