🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 11:52 pm Posted by : TELANGANA KERATAM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు భుజరంపేట విద్యార్థిని ఎంపిక

News Image
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు భుజరంపేట విద్యార్థిని ఎంపిక

కౌడిపల్లి తెలంగాణ కెరాటం నవంబర్ 20 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం భుజరంపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థిని కే. పూజ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఎస్‌జీఎఫ్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-17 బాలబాలికల కబడ్డీ పోటీల్లో మెదక్ జిల్లా తరఫున పూజ పాల్గొంది.ఈ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పూజ పాల్గొననుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత, పీడీ శేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని పూజను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థినిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందించారు.
🏠 Home