🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 11:56 pm Posted by : TELANGANA KERATAM

తాండూరులో మనోహర్ రెడ్డి,పరిగిలో శ్రీనివాస్ రెడ్డి పోటీ -అన్నదమ్ముల రాజకీయ వ్యూహం -నియోజకవర్గాల్లో జోరుగా చర్చ -పరిగి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన శ్రీనివాస్ రెడ్డి -బుయ్యని కుటుంబానికి పరిగితో మూడు దశాబ్దాల అనుబంధం -లేకుంటే బీజేపీ నుంచి శ్రీనివాస్

News Image
తాండూరులో మనోహర్ రెడ్డి,పరిగిలో శ్రీనివాస్ రెడ్డి పోటీ 

-అన్నదమ్ముల రాజకీయ వ్యూహం
-నియోజకవర్గాల్లో జోరుగా చర్చ 
-పరిగి నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన శ్రీనివాస్ రెడ్డి -బుయ్యని కుటుంబానికి పరిగితో మూడు దశాబ్దాల అనుబంధం 
-లేకుంటే బీజేపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి దిగే అవకాశం?
-పరిగిలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పోటీగా కొత్త సమీకరణలు
 - అంతర్ మథణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే
 - తాండూరులో మళ్లీ మనోహర్ పోటీ..!


ఎన్నికల అసెంబ్లీకి ఇంకా రెండేళ్ల సమయం తాండూరు, పరిగి నియోజక వర్గాల్లో అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. 'ఇక్కడ అన్న.. అక్కడ రాజకీయాల్లో తమ్ముడు' అనే ప్రచారం స్థానిక ఆసక్తికర చర్చకు తెరలేపింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరో సారి అక్కడి నుంచే పోటీ చేస్తారని, ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరిగి నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పరిగిలో జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసిన ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. పరిగితో మనోహర్ రెడ్డికి ఉన్న మూడు దశాబ్దాల రాజకీయ అనుబంధం, తాండూరు లో ఆయనకు ఉన్న ఎమ్మెల్యే హోదా అన్నదమ్ముల వ్యూహంపై ఆసక్తిని పెంచుతోంది.

 తెలంగాణ కెరటం,తాండూరు ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైంది. అందుకు కారణం ఒక్కటే.. ఇక్కడ అన్న.. అక్కడ తమ్ముడు.. అంటూ ప్రచారం సాగుతోంది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరులోనే మళ్లీ పోటీ చేస్తారని, ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరిగి నుంచి బరిలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారరం రెండు నియోజకవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అన్నదమ్ముల వ్యూహం ఏంటి?

ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ఎమ్మెల్యేకు పోటీ

నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే అది ఆ కుటుంబానికి రాజకీయంగా పెద్దగా మారుతుంది. తాండూరు, పరిగి రెండు సరిహద్దు నియోజకవర్గాలు. రెండు చోట్ల బంధుత్వాలు, పరిచయాలు, కార్యకర్తల నెట్వర్క్ కలిసి ఉంటుంది. అన్న తాండూరులో, తమ్ముడు పరిగిలో ఉంటే ఇద్దరికీ ఒకరి బలం మరొకరికి కలిసి వస్తుందని బుయ్యని అభిమానులు లెక్కలు వేస్తున్నారు. ఒకే కుటుంబం రెండు చోట్ల ఉండటం కేవలం కుటుంబ బలం మాత్రమే కాదు, ఒక వ్యూహం కూడా కార్యకర్తలు, అభిమానులు రెండు చోట్లా కలిసి పనిచేస్తే ప్రచారానికి పెద్ద ఊపు వస్తుంది.

 పరిగి నుంచి శ్రీనివాస్ రెడ్డి..?


పరిగి నుంచే అసలు చర్చ మొదలైంది. పరిగిలో జరిగిన ఓ కార్యక్రమంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో పరిగి నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీనికి బలమైన కారణం ఉంది.మనోహర్ రెడ్డి సొంత గ్రామం తిర్మలాపూర్. కులకచర్ల మండలం పరిగి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అంటే బుయ్యని కుటుంబానికి మూలాలు పరిగిలోనే ఉన్నాయి. బుయ్యని బ్రదర్స్ పరిగిలో కొత్తేం కాదు. మనోహర్ రెడ్డి కులకచర్ల నుంచి జడ్పీటీసీగా, సొసైటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికై, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీబీ చైర్మన్ గా పని చేశారు.
గత 30 సంవత్సరాలుగా పరిగి నియోజ కవర్గంలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. గతంలో పలుమార్లు పరిగి నుంచి పోటీ చేయడానికి మనోహర్ రెడ్డి ప్రయత్నాలు కూడా చేశారు. శ్రీనివాస్ రెడ్డి అంటే పరిగి ప్రాంతంలో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి బలంగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీ ఇస్తే త్రిముఖ పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనా కూడా ఉంది.
🏠 Home