🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 6:22 am Posted by : TELANGANA KERATAM

12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు*

News Image
*12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు* 
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ 
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రతి కుటుంబానికి ఒక భరోసా – ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం” నమోదు ప్రక్రియను వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలకు ఇందిరమ్మ భీమా పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, అర్హతలు, ప్రయోజనాల గురించి వివరించారు. లబ్ధిదారులకు పథకంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రేషన్ కార్డులో పేర్లు కలిగి ఉండి, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఈ పథకానికి అర్హులని తెలిపారు.
మున్సిపల్ కార్యాలయానికి చెందిన 12వ వార్డు అధికారులు శ్రీకాంత్, సందీప్, సాయి ఆధ్వర్యంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ నమోదు కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని కౌన్సిలర్ పులిమామిడి మమత తెలిపారు.
కావున 12వ వార్డులోని అర్హులైన ప్రతి కుటుంబ సభ్యుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి 12:00 గంటల వరకు 12వ వార్డులోని పిఎంఆర్ గణేష్ మండపం వద్దకు విచ్చేసి అవసరమైన ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పులిమామిడి మమత వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చేయూత పెంక్షన్లు పొందిన వారందరికి నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అదేవిధంగా ద్వాక్రా మహిళలలందరికి ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభించబడుతుందని పులిమామిడి మమత ఈ సభాముఖంగా 12వ వార్డు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ద్వాక్రా మహిళలు, ఆర్‌పి శారద, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు (ఓ బి )మాలె అనిత మరియు వార్డు ప్రజలు నీలి మల్లమ్మ, నాయికోటి కావేరి, రుమాండ్ల నర్సింలు, వర్కల లక్ష్మి, నీలి శ్రీనివాస్, అవంతిక, మంజు, శైలజ, లక్ష్మణ్ తదితరులతో పాటు మహిళలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home