🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 6:26 am Posted by : TELANGANA KERATAM

చెరువులో పడి వ్యక్తి మృతి

News Image
చెరువులో పడి వ్యక్తి మృతి

కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 20:

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామానికి చెందిన బయి కాడి యాదగిరి (32) అనే వ్యక్తి చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. యాదగిరి చేపలు పట్టే వృత్తి చేస్తుంటాడు. ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో చేపలు పట్టేందుకు గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లాడు. సాయంత్రం అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుమారు 6.30 గంటలకు గ్రామస్తులు చెరువులో పరిశీలించగా యాదగిరి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కౌడిపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు.మృతుడి భార్య బయి కాడి మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి నీటిలో మునిగి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడు యాదగిరికి భార్య మంజుల, కుమారుడు చరణ్ (17) ఉన్నారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న యాదగిరి ఆకస్మిక మరణంతో భార్య, కుమారుడు కన్నీరుమున్నీరవుతున్నారు ఆయన మృతితో కొట్టాల గ్రామంలో విషాదం నెలకొంది.
🏠 Home