🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 6:28 am Posted by : TELANGANA KERATAM

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

News Image

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.జైపూర్..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న  దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మండల తహసిల్దార్ వనజా రెడ్డితో కలిసి పరిశీలించి ఇప్పటివరకు అందిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలోని 18 నుండి 59 సంవత్సరాల వరకు వయసు ఉన్న వ్యక్తి బీమా వ్యక్తిగా ప్రతిపాదించబడతారని, భీమా పొందే వ్యక్తి స్వయంగా దరఖాస్తుపై సంతకం చేసి, నామిని వివరాలను తెలియపరిచి స్వయంగా అందించాలని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేసి, దరఖాస్తులు స్వీకరించి, ఆన్ లైన్ పోర్టల్ లో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని, దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన అర్జీదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జైపూర్ గ్రామంలో ఇప్పటి వరకు 28 దరఖాస్తులు అందాయని తెలిపారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఎస్.సి. వసతి గృహ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు 66 దరఖాస్తులు అందాయని, పథకానికి సంబంధించిన దరఖాస్తులను పూర్తి వివరాలతో జాగ్రత్తగా నమోదు చేయాలని, నామినీ వివరాలను లబ్ధిదారుల ఇష్టపూర్వక సమ్మతితోనే నమోదు చేయాలని సూచించారు. నామినీ ఎంపిక విషయంలో సంబంధిత లబ్ధిదారుల నుంచి భౌతికంగా సంతకాలు తీసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🏠 Home