పొన్కల్ లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
ఈ కార్యక్రమంలో సంఘం గ్రామ అధ్యక్షులు పొట్టేల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవనాధారమైన చెరువుల పరిరక్షణతో పాటు గంగపుత్రుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రవి, క్యాషియర్ రమేశ్‌తో పాటు పలువురు గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.