Date of Publish : 21 November 2026, 2:55 pm
Posted by : TELANGANA KERATAM
ఏఐటియుసి 43వ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి.
పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21); ఈ నెల నవంబర్ 22 నుంచి 26 వరకు కర్ణాటక రాష్ట్రంలోనే బెంగళూరులో జరిగే ఏఐటియుసి 43వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏఐటియుసి జాతీయ మహాసభల సందర్భంగా 22వ తేదీన భారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ బెంగళూరులో జరుగుతుందని ఈ బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనీ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘంగా 107 సంవత్సరాలుగా దేశంలో కార్మికులకు అండగానిలబడి కార్మికుల చట్టాలు తీసుకురావడంలో అగ్రగామిగా ఉందని అన్నారు. బ్రిటీష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న చట్టాలను నేడు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు కకార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేయడం కోసం ఈ మహాసభలో పోరాటం కార్యక్రమాన్ని రూపొందిస్తామని తెలిపారు. కనీస వేతన చట్టాలు అమలు చేయడంలో పాలకులు పూర్తిగా వైపల్యం చెందారని ఆరోపించారు. శ్రమ దోపిడి కి మారుపేరుగా ఉన్న కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందర్నీ పర్మినెంట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బెంగళూరులో జరిగే జాతీయ మహాసభకు జిల్లా నుండి కార్మికులు పాల్గొని బహిరంగ సభ ను జయప్రదం చేయాలని దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.