స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 19 సాఫ్ట్ బాల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన పుల్లూరి రాహుల్
తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో రాం వేణు...
ఆసిఫాబాద్....
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బాయ్స్ అసిఫాబాద్ లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న పుల్లూరి రాహుల్ ఈనెల 18-11-2026 నుండి 22-11-2026 వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ జరిగే 70వ SGF జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ అండర్-19 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు.
కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం ప్రోత్సాహంతో రాహుల్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనబోతున్నాడు.రాహుల్ ను కోట యాదగిరి పిడి , ఎస్ ప్రసాద్ పిఈటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్ జిఎఫ్ సెక్రెటరీ బి.బాబురావు మరియు హౌస్ మాస్టర్ డి శ్రీనివాస్ , కళాశాల అధ్యాపక బృందం అభినందించారు