🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:07 pm Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నాo.

News Image
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యo అని అచ్చంపేట పట్టణం, అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా కుటుంబ భరోసా లబ్ధిదారులకు బీమా పత్రాలను పంపిణీ చేశారు.ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ను ప్రారంభించడం జరిగిందనికుటుంబానికి అండగా నిలిచే ప్రధాన సంపాదనపరుడు అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఈ పథకం భరోసా కల్పిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బుచ్చి రాములు, అచ్చంపేట పట్టణ అధ్యక్షులు ఖాదర్, మున్సిపల్ అధికారులు వివిధ వార్డు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
🏠 Home