🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:17 pm Posted by : TELANGANA KERATAM

మద్యం మత్తులో కారు నడిపి ఆటోను గుద్దిన డ్రైవర్ 10 మందికి గాయాలు

News Image
తెలంగాణ కెరటంనవంబర్ 21సూర్యాపేట జిల్లా మునగాల:ప్రతినిధి: సీహెచ్. నవీన్
మద్యం మత్తులో కారు నడిపి ఆటోను గుద్దిన డ్రైవర్  10 మందికి గాయాలుతిరుమలగిరి వద్ద రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి అతివేగంతో వచ్చిన కారు (నం. TS 29 L 3946) బలంగా ఢీకొట్టింది. కారు డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ప్రయాణికులు ఉండగా, వారందరికీ గాయాలయ్యాయి. కారు బలంగా గుద్దిన ధాటికి దాని ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో వెనుక మరియు పక్క భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీ శబ్దం విన్న సమీపంలోని స్థానికులు వెంటనే స్పందించి, ఆటోలో ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి సహాయం చేశారు.
గాయపడిన వారందరినీ తక్షణమే చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన బాధితులకు ప్రభుత్వం తగిన సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Additional News Photo
🏠 Home