దళిత పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి అమానుషం నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలి!
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ ఖండన. ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న దళిత మహిళ చందుపట్ల రమణ (45)పై బాలకృష్ణ అనే వ్యక్తి కులం పేరుతో దూషిస్తూ, సెంట్రింగ్ కర్రతో కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ తీవ్రంగా ఖండించారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికుల పట్ల ఇలాంటి దాడులకు పాల్పడటం అత్యంత బాధాకరమని, ఒక మహిళ అని కూడా చూడకుండా కులం పేరుతో అవమానిస్తూ భౌతిక దాడికి దిగడం దారుణమని ఆయన పేర్కొన్నారు.రోజువారీ కూలీ పనిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న పేద దళిత మహిళపై దాడి చేయడం అమానుషమని, పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించకుండా వారిని చిన్నచూపు చూడటం తగదని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు.ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు బాలకృష్ణను అరెస్టు చేయాలని, బాధితురాలిపై కులం పేరుతో దూషణలకు పాల్పడిన వారందరిపై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం, తగిన భద్రత కల్పించడంతో పాటు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.దళిత మహిళలపై, పారిశుద్ధ్య కార్మికులపై దాడులను ఎమ్మార్పీఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, బాధితురాలు చందుపట్ల రమణకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందని, ఆమెకు న్యాయం జరిగే వరకు బాధితురాలి పక్షాన పోరాటం కొనసాగిస్తామని నల్ల చంద్ర స్వామి మాదిగ స్పష్టం చేశారు.నల్ల చంద్ర స్వామి మాదిగ MSP మాజీ జిల్లా అధ్యక్షులు MRPS రాష్ట్ర నాయకులు యాదాద్రి భువనగిరి జిల్లా 9948101083