కొక్కిరాల సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ.
చక్కగా చదవాలి.. ఉద్యోగం కొట్టాలి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్......
తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో రాం వేణు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి శ్రీమతి కొక్కిరాల సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా మరికొంతమంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించి తమ తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ, సమయపాలన ఎంతో ముఖ్యమని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.అలాగే, రాబోయే పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల సన్నద్ధతను అంచనా వేసేందుకు ఈరోజు ప్రత్యేకంగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కన్వీనర్ శరత్ , ఫ్యాకల్టీ ఇన్‌చార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.