🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:36 pm Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ జీవిత బీమా తో పేద కుటుంబాలకు భరోసా

News Image

5వ వార్డు కాంగ్రెస్ నాయకులు సింగపాగ అనిల్ కుమార్

సోలిపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవితం భీమ దరఖాస్తుల స్వీకరణ షాద్నగర్ నవంబర్ 21( తెలంగాణ కెరటం)ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని 5వ వార్డు కాంగ్రెస్ నాయకులు సింగపాగ అనిల్ కుమార్ అన్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని శనివారం 5వ వార్డు కౌన్సిలర్ భర్త సింగపాగ అనిల్ కుమార్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఈ పథకం కింద వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందజేస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య బాబు నాయక్ సింగపాగ శ్రీశైలం. లింగం నాయక్. బాలయ్య తదితరులు పాల్గొన్నారు

🏠 Home