🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:47 pm Posted by : TELANGANA KERATAM

పదేళ్లుగా అందని పెన్షన్‌కు మోక్షం.. పోలేపల్లి వరలక్ష్మికి పెన్షన్ మంజూరు!

News Image
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా, బుగ్గారం:
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెన్షన్ కోసం ఎదురుచూసిన పోలేపల్లి వరలక్ష్మికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు పెన్షన్ మంజూరైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బుగ్గారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుగ్గారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు:
 గ్రేడ్-A రకం: క్వింటాలుకు రూ.2,461
సాధారణ రకం: క్వింటాలుకు రూ.2,441
ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్నరకాలైన BPT, RNR, HMT, జై శ్రీరామ్, KNM 1638, WGL 44, KNM 7715 ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ అందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గారు బుగ్గారం మండల తాజా మాజీ జెడ్పిటి సభ్యులు బాదినేని రాజేందర్ గారు , గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ, నాయకులు నగునూరి నర్సగౌడ్, వేముల సుభాష్, చిలుముల లక్ష్మణ్, పీఏసీఎస్ డైరెక్టర్లు పెరుమాండ్ల ఎల్లాగౌడ్, నూర లక్ష్మి, కుమ్మరి రవి, మండల తహసీల్దార్ వినోద్, సివిల్ సప్లై డీఎస్ఓ జితేందర్ రెడ్డి, డీటీ రాకేష్, వ్యవసాయ శాఖ ఏఓ అక్షిత, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, రైతులు, పీఏసీఎస్ సీఈఓ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.ఇది ఇందిరమ్మ రాజ్యం.. ఇది ప్రజా పాలన! అర్హులకు సంక్షేమం.. రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం.
🏠 Home