🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:49 pm Posted by : TELANGANA KERATAM

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి

News Image
వరంగల్ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 21
తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ట్రాన్స్‌జెండర్ పుష్ప డిమాండ్ చేశారు. ట్రాన్స్‌జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పుష్ప మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు అనేక వివక్షలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి గౌరవప్రదమైన జీవనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు నెలకు రూ.10 వేల పింఛన్ అందించాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, గృహ వసతి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఆరోగ్య భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే ట్రాన్స్‌జెండర్లపై జరుగుతున్న వివక్ష, వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వారి అభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి, హామీలను అమలు చేయాలని పుష్ప ప్రభుత్వాన్ని కోరారు.
🏠 Home