🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 3:59 pm Posted by : TELANGANA KERATAM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ – విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యం.... ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...

News Image
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ – విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యం.... ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్....... తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో ఛీఫ్ రాం వేణు ..........
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్‌లో ఉన్న ఎ.సి.సి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ సందర్శించారు.
ఈరోజు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, వాటి అవసరాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే ఎమ్మెల్యే విద్యార్ధులకు 75 బెంచీలు డిసెంబర్ లో ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే వచ్చే సంవత్సరం పాఠశాల ప్రారంభ నాటికి నూతన భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న అవసరమైన ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడ బెంచీలు అందిస్తానని తెలిపారు.
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య,ప్రతి ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన వసతులు, ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, ఎం.ఈ.ఓ మాలతి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు పూదరి తిరుపతి, స్థానిక కార్పొరేటర్ గంగవరపు వెంకటేశ్వర్లు, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..
🏠 Home