🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 4:48 pm Posted by : TELANGANA KERATAM

మందమర్రి మున్సిపాలిటీ 19వ వార్డులో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

News Image

తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో రాం వేణు.
చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, మందమర్రి మున్సిపాలిటీ 19వ వార్డులో ఇందిరమ్మ బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రాజలింగు , మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంద తిరుమలరెడ్డి , సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే ప్రక్రియను సంబంధిత అధికారులు ఆన్‌లైన్ చేసారు 
ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ బీమా పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనదని, కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఆర్పీలు (ఆర్. పి.లు), సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home