ఘనంగా మాజీ డి సి సి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జన్మదిన వేడుకలు
తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో రాం వేణు
మందమర్రి లో మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కొక్కిరాల సురేఖమ్మ 63వ జన్మదిన వేడుకలను మందమర్రి పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీసీసీ సభ్యులు నూకల రమేష్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి సురేఖమ్మ చేసిన సేవలు ఎంతో అభినందనీయమని, ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించి, పార్టీ గెలుపునకు విశేషంగా కృషి చేసిన నాయకురాలు అని కొనియాడారు.సురేఖమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి, ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజల ఆశీస్సులతో పార్టీ తిరిగి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కోసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నడిగోట నరేందర్, కోపర్తి నవీన్, అశోక్, రంజిత్, అనిరుధ్, అక్బర్, రమేష్, ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.