🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 6:08 pm Posted by : Kancharala Shivakumar

ఎల్‌నినో ప్రభావంపై విద్యార్థుల్లో అవగాహన -నృత్యాలు, నాటికలతో నీటి పొదుపుపై సందేశం

News Image

దుబ్బాక, నవంబర్ 21:(తెలంగాణ కెరటం)

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో నీటి ప్రాధాన్యత, సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాస్టర్‌మైండ్స్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నీటి కొరత వల్ల ఎదురయ్యే సమస్యలు, వర్షాభావ పరిస్థితులతో తాగునీరు, సాగునీటికి కలిగే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని సందేశాన్ని అందించారు. విద్యార్థుల ప్రదర్శనలు కార్యక్రమానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హరిబాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి ప్రతి చుక్క ఎంతో విలువైనదని, నీటితో పాటు విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పొదుపు అలవాట్లను పెంపొందించాలని, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 Home