🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 7:03 pm Posted by : TELANGANA KERATAM

వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో తులసి బృందా సహిత నారాయణ కళ్యాణోత్సవం

News Image
వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో తులసి బృందా సహిత నారాయణ కళ్యాణోత్సవం

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 21:

కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో గల శ్రీశిరిడి సాయి ప్రేమ మందిరంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస చిలుకు ద్వాదశిని పురస్కరించుకొని శ్రీ తులసి బృంద సహిత ధాత్రి నారాయణ కళ్యాణం మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో ముఖ్యంగా చిలుకు ద్వాదశి రోజు తులసి బృందా సహిత నారాయణ తులసి కళ్యాణం నిర్వహించడం జరిగిందని తెలిపారు. తులసి కళ్యాణం రోజు తులసి వనంలో భోజనం చేసిన వారికి తులసి నారాయణ ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరం వ్యవస్థాపకులు మంజుల విజయ్ కుమార్, ఆలయ అర్చకులు చండీ ప్రసాద్ శర్మ, డాక్టర్ విట్టల్ సావిత్రి దంపతులు, డాక్టర్ రాజేశ్వరరావు దంపతులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home