🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 7:42 pm Posted by : TELANGANA KERATAM

బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం

News Image

మేడిపల్లి బిజెపి మండల అధ్యక్షులు చిట్యాల సురేష్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బిజెపి మేడిపల్లి మండల అధ్యక్షులు చిట్యాల సురేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (ఎస్ఐఆర్) ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తూ, భయాందోళనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వాస్తవాలను తెలియజేసి, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు బండి సంజయ్ కుమార్ ఈ నెల 23,వ తేదీన కరీంనగర్‌లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఈ చారిత్రాత్మక పాదయాత్రలో మేడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు చిట్యాల సురేష్ కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కో-కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి, మేడిపల్లి మండల ఇంచార్జి కోడిపెల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఎస్.ఎన్. రెడ్డి, కొప్పెర లింగారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మామిడి ధర్మ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తౌట్టి తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు గోస్కి మధు, బత్తుల రమేష్, తోపారపు రవికుమార్, మాజీ ఎంపీటీసీ మేకల రాజు, మండల ఉపాధ్యక్షులు బాజోజి హనుమంతాచారి, అదె రమేష్, బూత్ అధ్యక్షులు చంద రమేష్, అడ్లగట్ట గణేష్, వెంకటేష్, బీమేష్, ఇతర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🏠 Home