🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:09 pm Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

News Image

కాళ్ళకల్ గ్రామ సర్పంచ్ మద్దూరి నవ్య నాగరాజు గౌడ్ తెలంగాణ కెరటం  మనోహరాబాద్: మండలంలోని కాళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ మద్దూరి నవ్య నాగరాజు గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రేషన్ కార్డులో నమోదై ఉండి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ప్రతి రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే జీవిత బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు.దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు), మొబైల్ నంబర్‌తో పాటు నామినీ వివరాలను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.ఈ పథకంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన వారందరూ ప్రయోజనం పొందేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు హాజరుకావాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

Additional News Photo
🏠 Home