🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:16 pm Posted by : TELANGANA KERATAM

సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

News Image
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన జువ్వాడి నర్సింగరావు 
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన 80 మంది లబ్ధిదారులు, కోరుట్ల మండల పరిధిలోని 127 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని, ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహిద్, మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర, ఎంపిడివో వోదెల రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు అడువాల జ్యోతి లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచులు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home