🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:29 pm Posted by : TELANGANA KERATAM

యువత మత్తుకు దూరంగా ఉండాలి. కల్వకుర్తి అబ్కారీ ఎస్.ఐ చాంద్ బి..

News Image
 జాతీయ యువజన అవార్డు గ్రహిత శివ కుమార్...

తెలంగాణ కెరటం కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవ బృందం, మై భారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *నషా ముక్త్ భారత్ యూత్ పార్లమెంట్* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నషా ముక్త్ యువ అంశం పై ఉపన్యాస పోటీల పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే డ్రగ్స్, మద్యం వల్ల కలిగే నష్టల పై అవగహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కల్వకుర్తి ఎక్స్సైజ్ శాఖ ఎస్ఐ చాంద్ బి గారు హాజరయ్యారు. చాంద్ బి గారు మాట్లాడుతూ యువత చిన్న వయస్సు లోనే మత్తు పదార్థాలు, మద్యానికి బానిసయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని అలాకాకుండా చదువు పై ద్యాస పెట్టి ముందుకు సాగాలి అని కోరారు. అలాగే డ్రగ్స్ వాడకం పట్ల చట్ట రీత్యా నేరం అని అందుకు జైలు శిక్షలు పడాల్సి ఉంటుంది అని విద్యార్థులకు చెప్పారు.అనంతరం విద్యార్థుల చేత మత్తుపదార్థాలకు దూరం ఉంటాము అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహిత శివ కుమార్ మాట్లాడుతూ దేశానికి యువత ఆస్థి అలాంటి యువత మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని దేశం కోసం యువత నడుంబిగించాలి అని అన్ని రంగాల్లో యువత ముందుండాలి అని తెలిపారు.అనంతరం నషా ముక్త్ యువ పార్లమెంట్ లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసారి. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మహబూబ్ అలీ, పర్శరాములు, స్వాతి, మల్లయ్య, రాజేష్ సేవా బృందం సభ్యులు హర్షిత్, ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

🏠 Home