🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:40 pm Posted by : TELANGANA KERATAM

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

News Image

అచ్చంపేటలో సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అచ్చంపేటనియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకుప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణం విస్తీర్ణం, ప్రజలు కూర్చునేందుకు అవసరమైనసదుపాయాలువాహనాల పార్కింగ్, వీఐపీల ప్రత్యేక పార్కింగ్, ప్రజల రాకపోకలకు అనువైన మార్గాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.సభా ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, బారికేడ్లు, అత్యవసర వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ......, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని అన్నారు.సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేలా అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గానికి విచ్చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలకు వేదిక కానుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ నేపథ్యంలో సభకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.సభా ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకుప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు బి చెన్నయ్య, దేవ సహాయం, అచ్చంపేట డిఎస్పీ పి శ్రీనివాసులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home