🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 8:59 pm Posted by : TELANGANA KERATAM

అంగరంగ వైభవంగా వెంకటాపూర్ శ్రీ వేంకటేశ్వరస్వామి జాతర

News Image

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల మండలం వెంకటాపూర్ శ్రీ వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయ అర్చకులు వెంకటరమణ వైదిక నిర్వహణలో ఉదయం అభిషేకం, విశేష అలంకరణ, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ అలువేలు మంగ, లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు, ధ్మపురి దేవస్థానం మాజీ ఛైర్మన్ జువ్వాడి కృష్ణారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు దంపతులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లు ఉత్సవంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో విక్రమ్, చైర్మన్ బర్కం నర్సయ్య, గ్రామ సర్పంచ్ ద్యాగ గంగాధర్, సభ్యులు శ్రీమతి ఎనుగందుల వనజ, పచ్చమట్టం గంగాధర్ గౌడ్, గండ్ర వెంకట గోపాల్ రావు, ద్యాగ రాజిరెడ్డి, పిట్టల రమేష్, సిబ్బంది పెడవెల్లి నర్సయ్య, రాజేంధర్, శివకేశవ్ లు, ఎంపిడివో వోదెల రామకృష్ణ, సీఐ కొమ్ము తిరుపతి, ఎస్సై శ్యామ్ రాజ్, వార్డు సభ్యులు, మాజీ ఎంపీపీ తోట నారాయణ, యువజన సంఘాలు, కోరుట్ల డిపో మేనేజర్, పలు మండలాల భక్తులు పాల్గొన్నారు.
🏠 Home