అక్లూర్ గ్రామంలో చేయూత పెన్షన్ల ప్రోసిడింగ్ కాపీలు అందజేసిన
సర్పంచ్ జిన్న జనార్ధన్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21:నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో సర్పంచ్ జిన్నా జనార్ధన్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయుత పెన్షన్ల పత్రాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం సంతోషకరమని తెలిపారు.అనంతరం లబ్ధిదారులు అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , అలాగే ముత్యాల సునీల్ అన్న కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జిన్నా జనార్ధన్, ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.