మందమర్రిలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ...
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు..
మందమర్రి పట్టణంలోని బి-1 క్యాంపు కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (సి.ఎం.ఆర్.ఎఫ్ ) చెక్కులను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి , మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు