🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 9:30 pm Posted by : TELANGANA KERATAM

వరిగడ్డి కాల్చవద్దు నేల సారాన్ని కాపాడండి

News Image
కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 21
 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వరి పంట కోత అనంతరం రైతులు పొలాల్లో మిగిలిన పంట అవశేషాలు (వరి గడ్డి) కాల్చవద్దని ఏడీఏ పుణ్యవతి సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు భూమి సారం తగ్గిపోతుందని, పర్యావరణం కలుషితమవుతుందని ఆమె తెలిపారు.పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం లేదా కంపోస్టుగా తయారుచేసి సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. అంతేకాకుండా పంట అవశేషాలను పశువుల మేతగా, ఇతర వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.పంట అవశేషాలను కాల్చడం వల్ల వెలువడే పొగ గాలి కాలుష్యానికి కారణమవడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. రైతులు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పంట అవశేషాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి స్వప్న, ఏఈఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home