అచ్చంపేటలో ఘనంగా మత్స్యకారుల బైక్ ర్యాలీ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):
అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సత్యలక్ష్మి ఫంక్షన్ హాల్ వద్దకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. మత్స్యకారులు ఐక్యంగా పాల్గొని తమ సంఘీభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పెబ్బేటి నిరంజన్ పలువురు మత్స్యకార నేతలు పాల్గొన్నారు.