పండగల సాయన్న పాట పాడి ఆలరించిన బిత్తిరి సత్తి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):ముదిరాజ్ సమాజం ఐక్యంగా ఉండి పోరాటాలు చేసినప్పుడే హక్కులు సాధ్యమవుతాయని బిత్తిరి సత్తి స్పష్టం చేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలులో శనివారం ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ సభలో సినీ నటుడు బిత్తిరి సత్తి మాట్లాడుతూ బానిస భావాలను వీడి ఆత్మగౌరవంతో జీవించాలని సూచించారు. ఐకమత్యంతో ముందుకు సాగితేనే సామాజిక గుర్తింపు లభిస్తుందన్నారు ముదిరాజ్ నిర్వహించిన సభలో మంత్రులు జూపల్లి వాకటి శ్రీహరి పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.