ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్ – పేదల ఆరోగ్యానికి బీఆర్ఎస్ అండ
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ శ్రీ కేపీ. వివేకానంద్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ ద్వారా మంజూరైన రూ.2,15,000/- ఎల్‌ఓసీని జీడిమెట్ల 132వ (287)డివిజన్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ కి చెందిన కూకట్ల సుధాకర్ తండ్రి మల్లయ్య కు చింతల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి, అవసరమైన సమయంలో అండగా నిలవడమే బీఆర్ఎస్ ప్రజాసేవ లక్ష్యమని తెలిపారు.పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అండగా నిలుస్తూ, సి ఎం ఆర్ ఎఫ్ ద్వారా మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ కేపీ. వివేకానంద్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సిద్దిరాములు, సుధాకర్ గౌడ్ సమ్మయ్య నేత, ఆటో బలరాం చంద్రశేఖర్ రెడ్డి మహిళా నాయకురాలు అరుణారెడ్డి కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు