ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మాత్రమే
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మాత్రమే :
- జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్
ఖమ్మం, నవంబర్ 22 :
అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనాలను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నమోదు ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం అర్హులైన వారి నుండి కేవలం దరఖాస్తుల, నమోదు ప్రక్రియ మాత్రమే జరుగుతోందని కలెక్టర్ అన్నారు. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత, దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని, పరిశీలన అనంతరం అర్హత సాధించిన లబ్ధిదారులకు ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద బీమా కవరేజీ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది, లబ్ధిదారులు ఎప్పటి నుండి క్లెయిమ్‌లు చేసుకోవచ్చు అనే తేదీలను రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని, ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, ప్రస్తుత నమోదు ప్రక్రియలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.