దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 21,(తెలంగాణ కెరటం)
దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట లో నిర్వహించినట్లు జీవివి కన్వీనర్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ బుచ్చిబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక టి. చక్రపాణి డిసిఇబి సెక్రెటరీ సిద్దిపేట మరియు విశిష్ట అతిధులు బి రవీందర్ ధర్మాజీపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , కె .సంజీవ , వి .తిరుపతి లచ్చపేట, రామక్కపేట గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విచ్చేయడం జరిగింది. శనివారం తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట లో చెకుముకి టాలెంట్ సంబరాలు ఉదయం: 11 గంటల నుండి 12 గంటల వరకు 8వ, 9వ,10వ తరగతుల ఆంగ్ల మాధ్యం మండలం నుండి మండలంలోని ప్రభుత్వ , రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు ప్రైవేటు పాఠశాలల నుంచి ఒక్కొక్క పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు ప్రతిభ పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి టి. చక్రపాణి డీసీబీ సెక్రెటరీ సిద్దిపేట మాట్లాడుతూ.. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం అవగాహన పెంచుకొని శాస్త్రీయ సమాజంలో నిర్మాతలుగా రావాలని తెలపడం జరిగింది. విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే నేటి బాలలే సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని కొత్త పరిష్కారాలు పరిశోధనలు చేసి భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని తెలిపారు. గత 20 సంవత్సరాల నుంచి జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉండే అపోహలను మూఢనమ్మకాలను తొలగించి విజ్ఞానవంతమైన సమాజానికి కృషి చేస్తుందని అభినందించారు. అలాగే జె వి వి కన్వీనర్ ఎస్ బుచ్చిబాబు మరియు డాక్టర్" ఎండి సాదత్ అలీ జె వి వి రాష్ట్ర కమిటీ మెంబర్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి టాలెంట్ టెస్ట్ కి విచ్చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉద్దేశించి మాట్లాడుతూ సైన్స్ ఉద్యమంలో మీరు అందరు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది.మండల స్థాయిలో విజేతలుగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు..ప్రభుత్వ పాఠశాల విభాగము నుండి నుండి ప్రథమ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దగుండవెల్లి, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంభీర్ పూర్
తృతీయ బహుమతి పిఎంసి జెడ్పి జిహెచ్ఎస్ దుబ్బాక మరియు రెసిడెన్షియల్ ,మోడల్ స్కూల్ విభాగం నుండి ప్రధమ బహుమతి టీ జీ ఎం ఎస్ లచ్చపేట, ద్వితీయ బహుమతి టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ దుబ్బాక తృతీయ బహుమతి టీజీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ గర్ల్స్ రామక్కపేట మరియు ప్రైవేట్ పాఠశాల విభాగం నుండి ప్రధమ బహుమతి వివేకానంద విద్యాలయం దుబ్బాక మరియు ద్వితీయ బహుమతి రజనీకాంత్ రెడ్డి స్కూల్ దుబ్బాక , తృతీయ బహుమతులు మాస్టర్ మైండ్ దుబ్బాక, సరస్వతి గ్లోబల్ స్కూల్ దుబ్బాక ,విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థిని విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులు అందరూ మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా రాష్ట్ర స్థాయిలలో ప్రథమ ,ద్వితీయ స్థానాలు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెవీవీ కన్వీనర్ ఎస్ బుచ్చిబాబు తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి , శంకర్ , వేణుగోపాల చారి జ్యోతి, మదన్ మోహన్ ,నరేష్, శంకర్, శ్రీనివాస్, ప్రణయ్ , యాదగిరి, నరేశ్, రామచంద్ర రెడ్డి, సిఆర్పి నవీన్ కుమార్ మరియు దుబ్బాక మండల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.