🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:16 am Posted by : TELANGANA KERATAM

ఘట్‌కేసర్‌లో తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు - 52 మంది బాలబాలికల ప్రతిభకు గుర్తింపు.. బెల్టులు, ధ్రువపత్రాల ప్రదానం

News Image
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 22: ఘట్‌కేసర్‌లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్‌లో ఆదివారం రియాన్ తైక్వాండో క్లబ్, అచీవర్ తైక్వాండో క్లబ్ సంయుక్తంగా బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్, కొండాపూర్, ఎన్‌ఎఫ్‌సీ నగర్, అవుషాపూర్ ప్రాంతాలకు చెందిన 52 మంది బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు డి. సుధీర్, డి. పృథ్వి బెల్టులు, ధ్రువపత్రాలు అందజేశారు. తైక్వాండో సాధనతో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని, ఒలింపిక్ క్రీడ అయిన తైక్వాండోలో రాణిస్తే ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా ద్వారా అవకాశాలు పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినయ్ జాన్, ఉపాధ్యాయురాలు అనిత పాల్గొనగా, పాఠశాల కరస్పాండెంట్ క్రిస్టినా క్విల్డెన్, ప్రిన్సిపాల్ జార్జ్ క్విల్డెన్ విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ తైక్వాండోతో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కోచ్ డి. నిహారిక తల్లిదండ్రులకు, తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీహరి మాస్టర్, అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి జి. శివకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Additional News Photo
🏠 Home