🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:27 am Posted by : TELANGANA KERATAM

వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ జువ్వాడి నర్సింగరావుకు సన్మానం

News Image
 తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ గా ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జువ్వాడి నర్సింగరావును సీనియర్ పాత్రికేయులు, తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్, మెట్ పల్లి మాజీ ఏంపిపి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోగిటి అంజయ్యలు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజాసేవకు అంకితమైన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలు సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర స్థాయిలో తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఇట్టి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ జువ్వాడి శేఖర్ రావుల సేవలు అమూల్యమైనవి, కొనియాడారు. నూతన చైర్మన్ తన పదవీకాలంలో కార్పొరేషన్‌ ను అభివృద్ధి పథంలో నడిపించాలని, సమాజంలోని అర్హులైన పేదలకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా కృషి చేయాలని తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్ ఆకాంక్షిస్థూ అభినందనలు తెలిపారు.
🏠 Home