🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:39 am Posted by : TELANGANA KERATAM

నీట్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ విద్యార్ధులను సన్మానించిన డిజిఎం భగవాన్ రెడ్డి, కోర్ డీన్ కె. శ్రీనివాస్

News Image

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)

ఎస్ఆర్ విద్యాసంస్థల నాణ్యమైన కోచింగ్‌తో పాటు సీనియర్ అధ్యాపకుల వివరణాత్మక బోధనతోనే నీట్ లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని 

ఈ సంవత్సరం ఎస్ ఆర్ కళాశాల నుంచి 705మార్కులతో వీరయ్య 
సహయు జాతీయ స్ధాయిలో 9 వ ర్యాంకు, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంకు
సాధించినందుకు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ వరదా రెడ్డి సంతోషాన్ని వ్యక్తపరిచారు.
హైదరాబాద్, మాదాపూర్ ఎస్ఆర్ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 
2024-26 విద్యాసంవత్సరంలో హైదరాబాద్ ఎస్ఆర్ కళాశాల విభాగంలో 
రెగ్యులర్ ఇంటర్‌తో పాటుగా నీట్ (NEET) కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 
72 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరిని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ 
శ్రీ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సిఈఓ సురేందర్ రెడ్డి, 
నీట్ కోఆర్డినేటర్ సుధాకర్, డీజీఎంలు భగవాన్ రెడ్డి, వాసుదేవరెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అభినందించారు. అనంతరం భగవాన్ రెడ్డి మాట్లాడుతూ నీట్ లో ఉన్నతమైన కోచింగ్‌తో పాటు సీనియర్ అధ్యాపకుల బోధన, వారాంతపు పరీక్షలు, స్టడీ అవర్స్, విద్యార్థులకు సందేహాల నివృత్తి చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్స్, డీన్స్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.
🏠 Home