🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:45 am Posted by : TELANGANA KERATAM

శ్రీరాం నగర్ - ఏ కమిటీ హాల్ నందు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన 279 వ డివిజన్ అధ్యక్షుడు నేమూరి నరేష్ గౌడ్

News Image
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
శ్రీరాం నగర్ - ఏ కమిటీ హాల్ నందు ఈరోజు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 279 డివిజన్ బీజేపీ అధ్యక్షులు నేమూరి నరేష్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. భారత్ ను పోలియో రహిత దేశంగా నిలుపుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బస్తీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.279 డివిజన్అధ్యక్షులు,నేమూరి నరేష్ గౌడ్
🏠 Home