🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 6:54 am Posted by : TELANGANA KERATAM

గంగా మాత ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న సురభి నవీన్

News Image
గంగా మాత ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న సురభి నవీన్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : మెట్పల్లి పట్టణంలోని గంగా మాత ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం శివగంగ కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, బోనాలు, తెప్పోత్సవం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పాల్గొన్నారు. సురభి నవీన్ వెంట బిజెపి కౌన్సిలర్లు బొడ్ల రమేష్, అరిసె వనజ-మురళి, మెట్ పల్లి గంగపుత్ర సంఘం అధ్యక్షులు, బిజెపి మెట్ పల్లి పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి సుంకేట విజయ్, బిజెపి నాయకులు, కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ సర్పంచ్ బడుగు భూమేష్, బిజెపి, బిజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home