🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 7:15 am Posted by : TELANGANA KERATAM

నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.

News Image
నాగర్ కర్నూల్ పట్టణంలో భారీ ర్యాలీ విజయవంతం చేయాలి.ఏ. శంకర్ మాదిగ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22):భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ దళిత మోర్చా నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. శంకర్ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు భారీ రాజ్యాంగ పుస్తకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా నవంబర్ 26న నాగర్ కర్నూల్ పట్టణంలోని జడ్పీ గ్రౌండ్ నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప హక్కులను కల్పించిందని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఏ. శంకర్ మాదిగ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు పంబ రాజు, అచ్చంపేట మండల అధ్యక్షుడు గాలిముడి రాము, జిల్లా కార్యవర్గ సభ్యులు పరుశరామ్ అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home