🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 7:57 am Posted by : TELANGANA KERATAM

భువనగిరిలో ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన సదస్సు

News Image
- ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని చైర్మన్తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్ పిలుపు
భువనగిరి, నవంబర్ 20 భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 18 మరియు 35వ వార్డుల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.18వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ...ఈ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వచ్చిన గొప్ప పథకం. ప్రతి కుటుంబంలో ఒకరికి రూ. 5 లక్షల బీమా ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 18 నుండి 59 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే. కులం, మతం తేడా లేదు. నవంబర్ 19 నుండి డిసెంబర్ 18 వరకే గడువు ఉంది. కాబట్టి 18, 35వ వార్డుల్లోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సభ్యత్వం నమోదు చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగాళ్ళ పల్లి రవి కుమార్ 18వ వార్డు కౌన్సిలర్ పాశం అమర్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
🏠 Home