పేదల కళ్ళల్లో ఆనందం... ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం!
భువనగిరిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవికుమార్
భువనగిరి: ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కలతో ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. భువనగిరిలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, అది ఒక కుటుంబానికి ఆత్మగౌరవం. గత ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్లు కేవలం పథకం కాదు, పేదలకు ఇచ్చిన మాట" అని అన్నారు.అర్హులైన వారికి కులం, మతం, పార్టీ చూడకుండా ఇళ్లు ఇస్తామని, ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో వేలాది మందికి ఇళ్లు మంజూరయ్యాయని, మిగిలిన వారికి కూడా దశలవారీగా అందిస్తామని చెప్పారు.
చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ.భువనగిరి పట్టణంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి సహకారంతో వార్డుల వారీగా సర్వే చేసి నిజమైన అర్హులను గుర్తించాం" అని అన్నారు.ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడబోమని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. మంజూరు పత్రాలు అందుకున్న వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే, చైర్మన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల కల నిజమైందని, పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోమున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్, పాలకుర్తి అబ్జర్వర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల, గౌరవ వార్డు కౌన్సిలర్లు మరియు కో-ఆప్షన్ మెంబర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.