🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 1:50 pm Posted by : ELIGETI VAMSHI KRISHSNA

వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి!

News Image
పొనకల్ లో ఇప్పటివరకు ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రం  ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ అధికారులను సంప్రదించగా ట్యాబ్‌లో లెవల్-3 రావడం లేదని, ప్రభుత్వ నిబంధనల కారణంగా కొనుగోళ్లు ప్రారంభించలేకపోతున్నామని చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొనకల్, ఆదర్శ్ నగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో సుమారు 2,000 బ్యాగుల వడ్లు తేమ శాతం తగ్గి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వడ్లను సాగు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దొడ్డు వడ్లు సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పేర్కొన్నారు.

ఈ సమస్యపై గౌరవ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చే వరకు అధికారులు వేచి చూడకుండా, తక్షణమే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా మీడియా మిత్రులు ఈ సమస్యను ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
 

🏠 Home