ఎల్లంపేట్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు చేతుల మీదుగా ప్రారంభం
తెలంగాణ కెరటం కామారెడ్డి, నవంబర్ 23:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లంపేట్ గ్రామంలో మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొహమ్మద్ షబ్బీర్ అలీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:మాజీ కౌన్సిలర్ రాంమోహన్, మాచారెడ్డి మాజీ పీఏసీఎస్ చైర్మన్ స్వామి గౌడ్, స్థానిక సర్పంచ్ అంజమ్మ–లక్ష్మీరాజాం, డీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రు నాయక్, మాచారెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, నడిమి తండా సర్పంచ్ కములు, వెనుకతండా సర్పంచ్ పద్మ–స్వామి నాయక్, బొడ్డగుట్ట సర్పంచ్ సంతోష్, అంకిరెడ్డిపల్లి తండా సర్పంచ్ శ్రీరామ్, గుంటితండా సర్పంచ్ వసంత–శివాలాల్, సెక్రటరీ ఖాజా అలీ, ఆరెపల్లి మాజీ సర్పంచ్ లింగారెడ్డి, వాడి మాజీ సర్పంచ్ రవి, మాజీ ఎంపీటీసీ మల్లయ్య, ఎడ్డయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు నాయక్, ఉపసర్పంచ్ రజిత, వార్డు సభ్యులు వికాస్ గౌడ్ (సన్నీ), గౌరవ్వ, లక్ష్మణ్, రాజ్య, లత, అడ్వకేట్ నరేష్, సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.