🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 6:46 am Posted by : TELANGANA KERATAM

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా,బార్ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

News Image
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్న కొల్లి సత్యనారాయణ 
ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఎ.ఐ.ఎల్.యు ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా,బార్ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా సమస్యలపై పనిచేసిన నేపథ్యంతో న్యాయవాదుల సమస్యలపై పోరాట అనుభవం.వివిధ ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు..1. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, పారదర్శకంగా భర్తీ చేయడం కోసం పోరాటాలు కొనసాగిస్తానని.2. ఉద్యోగ నియామకాలు:నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించడం కోసం శాసనమండలి వేదికగా పోరాడుతానని తెలియజేస్తున్నారు.
3. ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న పట్టభద్రులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించడం కోసం.4. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం కోసం.5. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ:ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడం కోసం.6. విద్యార్థుల సమస్యలు:ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను పరిష్కరించడం కోసం 7. ఉద్యోగుల హక్కులు: పాత పెన్షన్ విధానం, పీఆర్సీ, డీఏ, ఇతర ఉద్యోగుల సమస్యలపై శాసనమండలి వేదికగా పోరాడుతానని తెలియజేస్తున్నారు.8. యువతకు ఉపాధి: స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాల కల్పన కోసం.9. మహిళా పట్టభద్రుల సమస్యలు: మహిళలకు ఉద్యోగ అవకాశాలు, సమాన వేతనం, కార్యాలయాల్లో భద్రత కల్పించాలని పోరాడుతానని తెలియజేస్తున్నారు.10. విశ్వవిద్యాలయాల అభివృద్ధి: అధ్యాపకుల నియామకాలు, పరిశోధనలకు నిధులు, మౌలిక సదుపాయాలు కల్పన కోసం.11. ప్రజాస్వామిక హక్కులు: ప్రశ్నించే గొంతుకలకు రక్షణ, ప్రజా సమస్యలపై శాసనమండలిలో చర్చకు ప్రాధాన్యత కల్పించడం కోసం.12. ప్రజలకు జవాబుదారీతనం: పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ శాసనమండలిని సమస్యల పరిష్కార వేదికగా మలుస్తానని
🏠 Home