🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 6:55 am Posted by : TELANGANA KERATAM

పోచారం డివిజన్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి

News Image
ప్రధాన రహదారులు, కాలనీల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని డీసీకి యువజన కాంగ్రెస్ వినతి
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి/ నవంబర్ 22: పోచారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులు, వివిధ కాలనీలలో మెరుగైన విద్యుత్ వెలుతురు సౌకర్యం కల్పించాలని కోరుతూ పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాపల్లి నుంచి కొర్రెముల వరకు, జోడిమెట్ల నుంచి చౌదరిగూడ మీదుగా ప్రతాప్‌సింగారం వరకు, అలాగే కాచవానిసింగారం వెళ్లే ప్రధాన రహదారులపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. వీధి దీపాలకు అవసరమైన విద్యుత్ వైర్లు, కేబుళ్లను కూడా ఏర్పాటు చేసి రహదారులన్నీ రాత్రివేళల్లో వెలుగులతో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించాలని కోరారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేకుండా ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాలు, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేశపాగుల వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
🏠 Home