🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 7:01 am Posted by : TELANGANA KERATAM

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 23, నవంబర్

News Image
ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 23, నవంబర్
ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందించాలి. సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: జిల్లా ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్లలో తమ సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
🏠 Home