🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 7:51 am Posted by : TELANGANA KERATAM

మానవ సేవ మాధవ సేవ ఆచరించి ప్రభోదించిన బాబా

News Image
మానవ సేవ మాధవ సేవ ఆచరించి ప్రభోదించిన బాబా
పలుస శంకర్ గౌడ్ ట్టపర్తి సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలు - వనపర్తి
పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి సందర్భంగా వనపర్తిలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకల్లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు.పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ సాయి బాబా గొప్పతనాన్ని కొనియాడారు.
"మానవ సేవే మాధవ సేవ" అని సత్య సాయి బాబా ప్రభోదించారని ఆయన గుర్తుచేశారు.
సాయి బాబా కేవలం చెప్పడమే కాదు, స్వయంగా ఆచరించి చూపారని శంకర్ గౌడ్ అన్నారు.
సత్య సాయి సేవా మార్గాన్ని మనమందరం ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్యా రంగంలో సాయి బాబా చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఆరోగ్య రంగంలో పేదల కోసం ఆయన ఏర్పాటు చేసిన ఉచిత ఆసుపత్రులు ఎంతో మందికి ప్రాణం పోశాయని అన్నారు.
వారు చూపిన బాటలో అందరం నడవాలని, మానవత్వంతో మెలగాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేయాలని శంకర్ గౌడ్ కోరారు.కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరినీ ప్రేమించడమే సాయి తత్వమని అన్నారు.సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచ సూత్రాలను పాటించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా సమితి కన్వీనర్ రమేష్ రెడ్డి ,సాహితీ కళా వేదిక గౌరవ అధ్యక్షులు నారాయణ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
వీరితో పాటు చక్రవర్తి, వెంకటేశ్వర్లు, భరత్ తదితరులు హాజరయ్యారు.
అనేకమంది సాయి భక్తులు, స్థానిక ప్రజలు ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
🏠 Home