🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 24 November 2026, 9:53 am Posted by : TELANGANA KERATAM

రాష్ట్రస్థాయి అండర్ 17 బాలుర నెట్ బాల్ పోటీలకు ఎంపికైన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులను అభినందిస్తున్న సి. ఐ పర్స రమేష్....

News Image

మందమర్రి పట్టణం పాత బస్టాండ్ లోని హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి చెందిన 5గురు విద్యార్థులు 17/11/2026 రోజున జరిగిన జోనల్ నెట్ బాల్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబర్చారు.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా జట్లను మంచిర్యాల జట్టు ఓడించి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు, అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎస్.కె షహబాజ్, పిప్రే శివచరణ్, రేకుల సాహెత్, వేముల శశివర్ధన్, నాగుల జాయ్ లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు ఈ సందర్బంగా వీరిని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్స రమేష్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. సి.ఐ రమేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించేవిధంగా శిక్షణ పొందాలని అందుకు ప్రతి పాఠశాలలో ఆటల మీద ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు చదువు, ఆటలు వీటిమీద ద్రుష్టి పెడితే ఇంకా వేరే ఆలోచనలు రావని, చెడు అలవాట్లకు బానిసలుగా మారరని అన్నారు. కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు 5గురు రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం మన పట్టణం, జిల్లాకే గర్వకారణం అని కొనియాడారు, రాష్ట్రాస్థాయి లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి కి కూడా ఆడాలని విద్యార్థులకు సూచించారు. వారికి అభినందనలు తెలిపారు,పాఠశాల డైరెక్టర్ రాం వేణు, మాట్లాడుతూ నవంబర్ 28,29 తేదీలలో ఖమ్మం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు .

🏠 Home